NLR: ఇందుకూరుపేట మండలంలోని రావూరు, పొన్నూరు పంచాయతీలలో గురువారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ పాలనపై అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమకు చెప్పాలని ప్రజలను కోరారు.