ADB: జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి హైదరాబాద్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని చంటి పేర్కొన్నారు.