GNTR: తెనాలి సుల్తానాబాద్‌లో దారి తప్పి తిరుగుతున్న రెండేళ్ల బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. బుధవారం రాత్రి స్థానికులు గుర్తించి త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడిని తమ సంరక్షణలో ఉంచి, వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఏమరపాటుతోనే బాలుడు దారి తప్పినట్లు పోలీసులు తెలిపారు.