KDP: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు జిల్లాలోని సాయిబాబా ఆలయాలు అత్యంత వైభవంగా ముస్తాబయ్యాయి. గురు పౌర్ణమి సాయిబాబాకు ఎంతో ఇష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. గురు పౌర్ణమి రోజున సాయిబాబా దర్శనం చేసుకోవడం వల్ల ఆయన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు, ఉదయం 6 గంటల నుంచి సాయిబాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.