SKLM: జిల్లాకు R&B EEగా ఏ. తిరుపతిరావును నియమిస్తూ అధికారులు బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇక్కడ EEగా పనిచేసిన రవి నాయక్‌కు SCగా పదోన్నతి పొందడంతో ఖాళీ ఏర్పడింది. నరసన్నపేట DEగా విధులు నిర్వహిస్తున్న ఏ. తిరుపతిరావుకు అదనపు ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇస్తూ EEగా పదోన్నతి కల్పించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నానని తెలిపారు.