KMM: న్యాయాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా జడ్జి రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి రాజగోపాల్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి శశిధర్ రెడ్డి ప్రకటించారు. రాజగోపాల్ గతంలోనూ ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశారు.