మెగాస్టార్ చిరంజీవి అంటే నటన మాత్రమే కాదు సేవా గుణం కూడా. ఆయన ఇప్పటికే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా టైంలో కూడా సినీ కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరివాడుగా మారి మెగాస్టార్ ముందుంటాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కష్టాల కడలిలో బతుకుతున్న అలనాటి హాస్య నటి పాకిజాను చిరంజీవి ఆదుకున్నారు. పలు సినిమాల్లో పాకీజా అలియాస్ వాసుకీ నటించి మెప్పించింది. అప్పట్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రకు మంచి పేరొచ్చింది. అటు తెలుగు, ఇటు తమిళ్ సినిమాల్లో ఆమె నటింటి లేడీ కమెడియన్ గా మంచి మార్కులు సాధించింది.
ప్రస్తుతం ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. సినిమా అవకాశాలు లేక ఇప్పుడు ఓ హాస్టల్ లో గడుపుతోంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఆమె ఉన్నదంతో పోగొట్టుకుని దీని స్థితిలో ఉంది. ఇటీవలె ఓ ఇంటర్య్యూలో ఆమె తన దీన స్థితిని వివరించింది. ఆమె పరిస్థితికి మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. ఆమెకు ఆర్థికంగా చేయూత నివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే సీరియల్స్, సినిమాల్లోనూ ఆమెకు పాత్రలు ఇచ్చి ఆదుకోవాలని సినీ ప్రముఖులకు సూచించారు. చిరంజీవితో పాటుగా నాగబాబు కూడా పాకీజాకు లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పాకీజా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తనకు సాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.