Hansika: హన్సికను టాలీవుడ్ హీరో వేధించాడా? యాపిల్ బ్యూటీ ఫైర్
అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా పరిచయైంది హన్సిక. టీనేజ్లోనే హీరోయిన్గా టర్న్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే ఈ మధ్య పెళ్లి చేసుకొని అడపదడపా సినిమాలు మాత్రమే చేస్తోంది అమ్మడు. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో హన్సికకు ఓ టాలీవుడ్ హీరో వేధించాడనే న్యూస్ బయటికి రావడంతో.. అమ్మడు తెగ ఫైర్ అయిపోయింది.
ప్రస్తుతం హన్సిక(Hansika)కు తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో సోషల్ మీడియాలోనే ఎక్కువగా టైం పాస్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత హాట్‌గా కనిపిస్తూ.. యాపిల్ అందాలతో హీట్ ఎక్కిస్తోంది. అయితే ఎట్టకేకలకు గతేడాది డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలస్‌లో.. సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది హన్సిక. ప్రస్తుతం ఆయనతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఈ మధ్యే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను కూడా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. అలాంటి ఈ బ్యూటీని ఓ టాలీవుడ్ హీరో వేధించాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో ఓ టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో డేట్‌కు వెళ్దామంటూ తరచూ వేధించాడట. దాంతో చివరకు హన్సిక ఆ కుర్ర హీరోకు బుద్ది చెప్పిందట. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారని, నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. దీంతో రీసెంట్గా ఈ వార్తలపై రియాక్ట్ అయింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పింది. ఇలాంటి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
ఇలాంటి ఊహాగానాలతో విసుగు చెందాను. ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలను తెలుసుకుంటే బాగుంటుందని.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో టాలీవుడ్ హీరో హన్సిక(Hansika) వెంట పడ్డాడనే న్యూస్‌కు చెక్ పెట్టినట్టయింది. ఇకపోతే.. ప్రస్తుతం హన్సిక 105 మినిట్స్, నా పేరు శృతి, రౌడీ బేబీ, గాంధారి, గార్డియన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఏదేమైనా.. అప్పట్లో హన్సిక అందానికి అట్రాక్ట్ కానీ హీరో లేడనే చెప్పాలి.