అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. వచ్చిన ఛాన్స్‌కు కూడా వదులుకుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వద్దని చెప్పడంతో.. నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు. ఇంతకీ రకుల్ ప్రీత్.. పవన్ కళ్యాణ్‌కు నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam Tej) కలిసి ‘బ్రో’ సినిమా(BRO Movie) చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ పబ్ సెట్ కూడా వేశారు.
ఇక నెక్స్ట్ షూటింగ్‌కి వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో.. రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) హ్యాండ్ ఇచ్చిందనే న్యూస్ వైరల్‌గా మారింది. బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను అనుకున్నారట. అమ్మడు కాల్షీట్స్ కూడా ఇచ్చేసిందట. కానీ తీరా సమయానికి అమ్మడు హ్యాండ్ ఇచ్చిందనే న్యూస్ వైరల్‌గా మారింది. తాను ఈ సాంగ్ షూటింగ్‌కు రాలేనని.. తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదంటూ.. హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో చేసేదేం లేక.. ఇప్పటికే పవన్(Pawan Kalyan) డేట్స్ ఇచ్చేశాడు కాబట్టి.. అప్పటికప్పుడు మరో బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దింపారట. ఊర్వశి రౌతేలాను చిత్ర యూనిట్ సంప్రదించగానే ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగులో అదిరిపోయే ఐటెంతో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశీ.. ఇటీవల అఖిల్ ‘ఏజెంట్’ మూవీలోను స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే రామ్, బోయపాటి సినిమాలోను కీ రోల్ ప్లే చేస్తోంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్‌తో సాంగ్ అంటే.. అమ్మడు ఎగిరి గంతేసినట్టే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) పవర్ స్టార్‌కు హ్యాండ్ ఇచ్చేంత సీన్ ఉందా? అనేదే అంతు బట్టడం లేదు. క్రిష్‌తో చేసిన ‘కొండపొలం’ సినిమా తర్వాత రకుల్‌ని పట్టించుకునే వారే లేరు. బాలీవుడ్లో ట్రై చేస్తున్నా అక్కడ వర్కౌట్ అవడం లేదు. దీంతో అమ్మడి కెరీర్ చివరి దశకు చేరుకున్నట్టే. అలాంటి బ్యూటీకి పిలిచి మరీ ఆఫర్ ఇస్తే.. వద్దని చెప్పడం ఏంటో.. అర్థం కానీ విషయమే. కనీసం ఐటెం సాంగ్తోనైనా అమ్మడి కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేదేమో.