»Dhanush New Movie Dhanush New Movie Announced In Bollywood Title Video Released
Dhanush New Movie: బాలీవుడ్లో ధనుష్ కొత్త సినిమా అనౌన్స్..టైటిల్ వీడియో రిలీజ్
హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
హీరో ధనుష్(Hero Dhanush) ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అడుగు పెడుతూ సినిమాలు ప్రకటిస్తున్నారు. కోలీవుడ్(Kollywood) నుంచి బాలీవుడ్(Bollywood)కి అక్కడి నుంచి హాలీవుడ్ (Hollywood)లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘సార్’ మూవీ(Sir Movie)తో టాలీవుడ్(Tollywood)ని టచ్ చేశారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్లో చేస్తున్న తాజా సినిమాను ప్రకటించారు. ధనుష్ చేస్తున్న బాలీవుడ్ మూవీకి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ధనుష్ విడుదల చేసిన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో:
‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein)అనే టైటిల్‌తో ధనుష్ మూవీ(Dhanush Movie) రూపొందనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్(Movie Update)ను మేకర్స్ ప్రకటించారు. టైటిల్, మూవీ గురించి తెలిపేందుకు చిత్ర యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో మాస్ లుక్‌లో ధనుష్ గడ్డంతో కనిపించారు. ఆ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు.
ధనుష్(Dhanush) ఇది వరకూ బాలీవుడ్(Bollywood)లో మూడు సినిమాలు చేశారు. అందులో రెండు సినిమాలకు ఆనంద్ ఎల్.రాజ్ దర్శకత్వం వహించారు. 2013లో ‘రాంజానా’ అనే మూవీతో ధనుష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2021లో ‘ఆత్రంగీ రే’ మూవీతో చేశాడు. వీరి కాంబోలో ఇప్పుడు మూడో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.