»Megastar Chiranjeevi Chiru Keeravani Combo To Be Repeated After 29 Years
Megastar Chiranjeevi: 29 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న చిరు, కీరవాణి కాంబో!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నర్ అయిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఏ సినిమా చేసిన సెన్సేషన్ అవుతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం.కీరవాణి(Music Director MM.Keeravani) కూడా ఏ సినిమాకు సంగీతం అందించినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక వీరిద్దరూ కలిస్తే ఆ సినిమా అదిరిపోవాల్సిందే. తాజాగా 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్(Combo repeat) కానుంది. అప్పట్లో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అద్భుత విజయాన్ని సాధించాయి.
వీరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘అపద్బాంధవుడు’, ‘ఎస్.పి.పరశురామ్’ వంటి సినిమాలు వచ్చాయి. చిరంజీవి(Megastar Chiranjeevi)కి కీరవాణి ఇచ్చే మ్యూజిక్ ప్రత్యేకమైందని ఇండస్ట్రీ టాక్. అయితే వీరి కాంబినేషన్ సెట్ అయ్యి చాలా ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ చిరు సినిమాలకు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, తమన్ వంటివారు సంగీతం అందిస్తూ వస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ మూవీకి మణిశర్మ(Manisharma) తనయుడు మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అయితే తాజాగా చిరంజీవి(Megastar Chiranjeevi) కథానాయకుడిగా ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట(Director Vasista) ఓ సినిమా రూపొందించనున్నారు. ఈ చిత్రానికి కీరవాణి(Music Director MM.Keeravani) మ్యూజిక్ అందిస్తారని తెలుస్తోంది. బింబిసార మూవీ విజయంలో కీరవాని పాత్ర చాలానే ఉందని చెప్పాలి. అందుకే తన తర్వాతి ప్రాజెక్ట్ కు కూడా కీరవాణితోనే స్వరాలు సమకూర్చేందుకు వశిష్ట సిద్దమయ్యాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీకి కీరవాణి వంద శాతం న్యాయం చేస్తాడని, అందుకే ఆయన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.