Om raut:ని విమర్శించడం కాదు, తెలుగు దర్శకులకు ఆ సత్తా ఉందా?
ఆదిపురుష్ విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut)పై సౌత్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే మన హీరోలను ఆన్‌స్క్రీన్‌పై ఎఫెక్టివ్‌గా చూపించలేకపోవడం వల్లే హిందీ దర్శకులతో కలిసి పని చేయకూడదని పలువురు అంటున్నారు.
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి మూవీ అలా ఉంది. ఇలా ఉంది అంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ని సరిగా చూపించలేదని విమర్శించేవారు ఎక్కువయ్యారు. అయితే, మన తెలుగు హీరోలను ఆన్ స్క్రీన్ పై ఎఫెక్టివ్ గా చూపించడం లేదని, అందుకే, బాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయకూడదని కొందరు వాదిస్తున్నారు. సరే, నిజంగానే ఓం రౌత్(Om raut) తీసిన సినిమాల్లో చాలా తప్పులు ఉన్నాయని ఒప్పుకుందాం. అయితే, ఓం రౌత్ తన కెరీర్ లో రెండు భారీ సినిమాలు తీశాడు. ఒకటి తాన్హజీ, మరోటి ఆదిపురుష్ హిందూ దేవుళ్లను వక్రీకరించినందుకు ఆదిపురుష్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఓం రౌత్ జీవితం కంటే పెద్ద అనుభవాన్ని అందించాడు. ఇప్పుడు, పద్మావత్, ఆదిపురుష్, తాన్హాజీ లేదా బ్రహ్మాస్త్ర వంటి భారీ స్థాయి ఈవెంట్ చిత్రాలను అందించడంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు.
అదే మన తెలుగు లేదా దక్షిణ భారత దర్శకుల విషయానికి వస్తే? త్రివిక్రమ్ వంటి దర్శకులు స్థానికంగా బలంగా ఉన్నప్పటికీ, అతని కథల రీమేక్‌లు చేసినా వేరే భాషల్లో హిట్ కావడం లేదు. షెహజాదా(AVPL) రీమేక్ అందుకు నిదర్శనం. త్రివిక్రమ్ మాత్రమే కాదు సుకుమార్, కొరటాల వంటి ఇతర దర్శకులు తమ చిత్రాలలో 15-30 నిమిషాల VFX కూడా సరిగా చేయం లేదు. వారు ఇప్పటి వరకు చెప్పుకోదగిన భారీ సినిమాలు ఏధీ చేయలేదనే చెప్పాలి. అందుకే సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ని ఓం రౌత్ తో పోల్చడం కూడా కరెక్ట్ కాదని కొందరు భావిస్తున్నారు. రాజమౌళి కాకుండా, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక గ్రాండ్ మూవీ చేయడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదని, అలాంటప్పుడు బాలీవుడ్ దర్శకులను విమర్శించడం ఎందుకు అనే కామెంట్స్ వినపడుతుండటం గమనార్హం.