Om Raut: ‘ఆదిపురుష్’ దెబ్బకు.. ఓం రౌత్ ఇంకా భయపడుతూనే ఉన్నాడు!
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. సినిమా విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన సరే.. ట్రోలింగ్ రాయుళ్లు చుక్కలు చూపిస్తున్నారు. దీనికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా అతీతం కాదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి రెండు నెలలు కావొస్తున్నా.. దర్శకుడు ఓం రౌత్ ఇంకా భయపడుతునే ఉన్నాడు.
రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ఆదిపురుష్’ ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ విజువల్ వండర్‌గా తీయాలనుకున్నాడు. కానీ గ్రాఫిక్స్ తేడా కొట్టడంతో అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది ఆదిపురుష్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్‌ని ఓం రౌత్ సరిగ్గా వాడుకోలేదు. దీంతో ఆదిపురుష్ బాక్సాఫీస్ లెక్క 450 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక ఈ సినిమా విషయంలో.. దర్శకుడు ఓం రౌత్‌ను దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇప్పటికీ ఓం రౌత్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే చాలు.. విరుచుకుపడుతున్నారు.
దారుణాతి దారుణమైనా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఓం భయపడినట్టున్నాడు. రీసెంట్గా ఎలాంటి హడావిడి లేకుండా.. ఆగస్ట్ 11 అర్ధరాత్రి నుంచి ఓటిటిలోకి వచ్చేసింది ఆదిపురుష్. సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే విషయాన్నితీరిగ్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓం రౌత్. ఆదిపురుష్‌ని ఓటిటిలో చూడమని ట్వీట్ చేసిన ఓం రౌత్.. దాని కింద కామెంట్స్ సెక్షన్‌ని డిజేబుల్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.
కేవలం ఆయన ఫ్రెండ్స్ ఫాలోవర్లు తప్ప ఎవరూ ట్విట్టర్లో మెసేజ్ పెట్టలేరు. దీంతో ట్రోలర్స్‌కు భయపడడం వల్లే ఓం రౌత్ ఇంత పని చేశాడని అంటున్నారు. ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చినప్పుడే ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అలాంటిది ఓటిటిలోకి వచ్చిన తర్వాత ఆ సీన్లు, వీడియోలతో యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడతారు. ఈ కారణంగానే ఓం రౌత్ డిజేబుల్ ఆప్షన్ తీసుకున్నాడని అంటున్నారు. అయినా కూడా ఓం మావను ఓ ఆట ఆడుకుంటున్నారు.