KMM: ఈనెల 21న ఖమ్మం నగరంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ ఛైర్మన్ జి. రాజ గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం న్యాయ సేవా సదన్ నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్ను రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.