Adipurush: ఆదిపురుష్ (Adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. వేడుకలో ప్రభాస్ (Prabhas) మాట్లాడేవరకు ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా చూశారు. డార్లింగ్ మాట్లాడే ముందు దర్శకుడు ఓం రౌత్ (Om Raut) మైక్ తీసుకున్నారు. వన్ రిక్వెస్ట్ అని ఫ్యాన్స్‌ను ఊరడించారు. అతను ఏం చెబుతారా..? అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. పక్కనే ఉన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను దగ్గరకు రావాలని కోరారు. ఆదిపురుష్ (Adipurush) అనేది సినిమా కాదని కావ్యం అని చెప్పారు. మూవీలో రాముడే హీరో అని చెప్పారు.
ఆదిపురుష్ (Adipurush) సినిమా కోసం పడిన కష్టాన్ని ఓం రౌత్ (Om Raut) గుర్తుచేసుకున్నారు. మూవీలో హనుమంతుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పారు. రాముడి ఇతివృత్తంతో వస్తోన్న సినిమా ఇది అని.. అందుకోసం నిర్మాతలు తనకో హామీ ఇవ్వాలని కోరారు. సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్లో ఒక సీటును వదిలి పెట్టాలని కోరారు. ఆ సీటులో హనుమంతుడి వచ్చి.. మూవీ చూసినట్టు ఫీల్ అవుతానని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా.. ఎన్ని స్క్రీన్లలో మూవీ రిలీజ్ అయితే.. అన్నీ చోట్ల ఒక సీటు వదిలి పెట్టాలని ఓం రౌత్ (Om Raut) కోరారు.
ఆ సమయంలో ఔం రౌత్ (Om Raut) భావొద్వేగానికి గురయ్యారు. కంటి నుంచి వస్తోన్న ఆనందాన్ని ఆపుకొని మాట్లాడారు. ప్రభాస్ (Prabhas) హత్తుకొని ఓదార్చారు. తర్వాత మైక్ తీసుకున్న ప్రభాస్ (Prabhas).. ఓం రౌత్ రిక్వెస్ట్ గురించి అడిగారు. మీకు ఓకేనా.. కాదా చెప్పాలని వేదిక మీదే అడిగేశారు. అందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సరేనని చెప్పారు. తర్వాత ప్రభాస్ (Prabhas) అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. మూవీ కోసం ఔం రౌత్ (Om Raut) టీమ్ చాలా కష్టపడిందని తెలిపారు. రోజుకు 20 గంటలపాటు పనిచేశారని తెలిపారు. ఆదిపురుష్ (Adipurush) మూవీకి అసలు హీరో ఓం రౌత్ అని కామెంట్ చేశారు. హ్యాట్సాప్ టు ఓం రౌత్ (Om Raut) అని ప్రకటన చేశారు.