»Prabhas About His Marriage In Adipurush Pre Release Event
Prabhas: తిరుపతిలో పెళ్లి చేసుకోనున్న ప్రభాస్.. ముహూర్తం ఎప్పుడంటే ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) ఎప్పుడు చేసుకుంటాడా అని అభిమానులు(Fans) ఎదురుచూస్తున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) ఎప్పుడు చేసుకుంటాడా అని అభిమానులు(Fans) ఎదురుచూస్తున్నారు. కానీ ఆ క్షణం రావడం లేదు. ప్రభాస్ పెళ్లిపై ఎన్నో పుకార్లు వచ్చినా చివరకు అవి రూమర్స్(Rumers)గానే మిగిలిపోయాయి. 40 ఏళ్లు దాటిన ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో “ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్(Adipurush pre release event)లో ప్రభాస్ పెళ్లి గురించి ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, రాముడిగా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఆదిపురుష ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి తిరుపతిలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. గోవింద నామస్మరణ జరిగే ప్రదేశంలో.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆదిపురుష్ గురించి, చిత్ర బృందం పడ్డ శ్రమ గురించి ప్రభాస్ వివరించారు. ఆదిపురుష్ సినిమా చేయడం గొప్ప అదృష్టమని అన్నారు. జానకి పాత్రలో నటించిన కృతి సనన్ కూడా ప్రభాస్ చేత ప్రశంసలు అందుకుంది. ఇక ప్రభాస్ మాట్లాడుతుండగా అభిమానులు పెళ్లి ఎప్పుడంటే కేకలు వేశారు. ప్రభాస్ నవ్వుతూ, `పెళ్లా.. తిరుపతిలోనే చేసుకుంటాలే ఎప్పుడైనా..` అని చెప్పాడు.. నిజంగానే ప్రభాస్ తిరుపతిలో పెళ్లి చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.