హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ (Masab Tank) వద్ద పెను ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ (NMDC) వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి (Traffic Jam) ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవడంతో రోడ్డుపై పారుతున్నది. సమాచారం అందుకున్నపోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకున్నారు.ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైకి వెళ్తోన్న సమయంలో ఆయిల్ డ్రమ్ములు కిందపడ్డాయి. దీంతో ఆయిల్ రోడ్డు మొత్తం విస్తరించింది. కిందపడిన ఆయిల్ ను గమనించకపోవడంతో వాహన దారులు స్కిడ్ అయ్యి పడిపోయారు.మొత్తం కింద నాలుగు డ్రమ్ములు రోడ్డుపై పడి పోయాయి. ఒక్కో డ్రమ్ 800 లీటర్ల సామర్థ్యం కలిగివుంది. అప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయింది. కిలోమీటర్ల మేర వాహనాల ఆగిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై సుమారు 50 ట్రిప్పుల మట్టిని జిహెచ్ఎంసి సిబ్బంది పోశారు. రోడ్డుపై మట్టి పోసి ట్రాఫిక్ పోలీసులు.. వాహన రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో మెహిదీపట్నం(Mehdipatnam), మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.