ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గుజరాత్ (Gujarat)జామ్‌నగర్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ (Cardiologist) గౌరవ్ గాంధీ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందటం నెట్టింట చర్చ జరుగుతోంది. 41 ఏళ్ల డాక్టర్ గాంధీ (Gandhi) అతని సర్వీస్‌లో ఇప్పటి వరుకూ 16,000 మందికి గుండె సంబంధిత ఆపరేషన్లు చేశారు. సామాన్యులకు ఇది వస్తుంది అనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే.. గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ సైతం అదే గుండె పోటుకు మరణించారు. అంతే కాకుండా గుండెపోట్లు సంఖ్యను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేవారు.
అలాంటి ఆయన అనుష్య రీతిలో నిన్న ఉదయం గుండెపోటు (heart attack)తో మరణించారు.ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు ఆయన్ను నిద్రలేపేందుకు గదిలోకి వెళ్లారు. ఆయన అచేతనంగా కనిపించడంతో వెంటనే హాస్పిటల్(Hospital)కు తరలించారు. ఆయన్ను బతికించం కోసం డాక్టర్లు రెండు గంటలపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ గౌరవ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం వైద్య వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా తర్వాతి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవారు సైతం సైత అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. చిన్నారులు సైతం కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోతున్నారు. దీనికి కరోనా వ్యాక్సిన్లు (Corona vaccines) కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.