హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. కాప్రా, ఘట్కేసర్, సరూర్‌నగర్, ఉప్పల్, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ సహా పలు చోట్ల ఈ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
Rain in Hyderabad november 23rd 2023 GHMC to be alert again to local people
హైదరాబాద్(hyderabad)లో ఈరోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం(rain) కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, కృష్ణానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, కూకట్ పల్లి, చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సహా నగరంలోని మొత్తం ఆరు జోన్లలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు(officers) హెచ్చరించారు. నాలాలు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే విషయంలో వాహనదారులు జాగ్రత్త వహించాలని కోరారు.
దీంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. అవసరమైతే అత్యవసర సేవల కోసం తమను సంప్రదించాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో వర్షం వస్తే పెద్ద ఎత్తున అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ఈ వర్షాలు నవంబర్ 26 వరకు ఉన్నాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఈ ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారం పొడవునా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని..ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం కనిపిస్తుందని తెలిపింది.