»Corona Cases Are Increasing Again India Central Health Department Alert To States
Corona cases: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..అలర్ట్ చేసిన కేంద్రం
పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.
640 new corona cases have been registered in the india december 22nd 2023
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలోని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటివల కేరళలో JN.1 వేరియంట్‌ను గుర్తించిన క్రమంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇన్ఫ్లుఎంజా లాంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు ఏర్పడితే వెంటనే ఆస్పత్రుల్లో చేరాలని తెలిపింది. దీంతోపాటు RT-PCR పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను కూడా పంపాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) ప్రకటనలో వెల్లడించింది.
COVID ALERT 🚨
👉 56000 Cases Reported In Singapore in 7D
👉355 Cases And 5 Deaths Reported in India in 1D
👉280 Cases Reported in Kerala
మరోవైపు రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చని గుర్తు చేసింది. ఈ క్రమంలో అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ అనారోగ్యం (SARI) కేసులను ముందస్తుగా గుర్తించాలని రాష్ట్రాలను కోరింది. దేశంలో మొట్టమొదటి కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసు డిసెంబర్ 8న కేరళలో కనుగొనబడింది. ఈ క్రమంలోనే కేరళతో సహా మరికొన్ని రాష్ట్రాల్లోకూడా ఇటీవల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్థిరమైన సహకార చర్యల ద్వారా తక్కువ కోవిడ్ నియంత్రణ చేపట్టవచ్చని ఈ సందర్భంగా గుర్తు చేసింది.