»Changes In Tax System Increase In Standard Deduction
Union Budget 2024: పన్ను విధానంలో మార్పులు… స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
కేంద్రబడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ కీలక అంశాలను వెల్లడించారు.
Changes in tax system... increase in standard deduction
Union Budget 2024: కేంద్రబడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానం(New tax regime) తీసుకొచ్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Niramala sitharaman) కీలక అంశాలను వెల్లడించారు. దీనిలో భాగంగా పన్ను శ్లాబుల్లో మార్పులు తీసుకొచ్చారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్లో మార్పును తీసుకొచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ .50 వేలుగా ఉంది. దాన్ని తాజాగా రూ.75 వేలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కొత్త పద్దతి వలన ఏడాదికి రూ.17,500 వరకు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. అయితే పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.
కొత్త పన్ను విధానంలో కూడా మునుపటి మాదిరిగానే రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. గతంలో రూ.3-6 లక్షల శ్లాబులో 5 శాతం ఆదాయపు పన్ను ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 7 లక్షలకు పెంచారు. దీనిలో కొన్ని మార్పులు కూడా చేశారు. గతంలో రూ.6-9 లక్షల శ్లాబు పన్ను విధానం ఇప్పుడు రూ.7-10 లక్షలకు మారింది. దీంతో రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన పని లేదు.
రూ.3-7 లక్షల వరకు 5 శాతం
రూ.7-10 లక్షల వరకు 10 శాతం
రూ.10-12 లక్షల వరకు 15 శాతం
రూ.12- 15 లక్షల 20 శాతం
రూ.15 లక్షల పైన 30 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.