హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్2’ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. అవతార్2 ది వే ఆఫ్ వాటర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను రాబట్టింది. 160 భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు భారత్ లో అద్భుత ఆదరణ లభించింది. ఇండియాలో ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.368.2 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది.
దీంతో భారత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టినట్లైయ్యింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఈ రికార్డు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’పై ఉండేది. ఆ సినిమా రూ.367 కోట్ల నెట్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును అవతార్2 బద్దలు కొట్టింది.