‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమా తర్వాత ఆమెకు పలు హిట్లు కూడా వచ్చాయి. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మతో నటించేందుకు కుర్ర హీరోలు పోటీపడ్డారు. అయితే ఇప్పుడు ఈమెకు ఫ్లాపుల బెడద పట్టుకుంది.
కృతి శెట్టి ఫస్ట్ సినిమా ఉప్పెన హిట్ అయినవిధంగా మిగిలిన సినిమాలు ఆ ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో చైతూతో చేస్తున్న ‘కస్టడీ’ మూవీ మాత్రమే ఉంది.
ఇకపోతే తమిళంలో సూర్యకు జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. తెలుగులో మాత్రం మునుపటి జోరుతో ఆమె కనిపించడం లేదు. దానికి తోడు ఉప్పెన బ్యూటీకి శ్రీలీల నుంచి గట్టిపోటీ ఉంది. శ్రీలీల ధమాకా హిట్ తో దూసుకుపోతోంది. దీంతో పెద్ద హీరోలు సైతం ఆమెను లైన్ లో పెడుతున్నారు.
ఇక త్వరలో బుట్టబొమ్మ సినిమా నుంచి అనిఖ సురేంద్రన్, ఏజెంట్ సినిమా నుంచి సాక్షి వైద్య, అమిగోస్ సినిమా నుంచి ఆషిక రంగనాథ్ వంటి కొత్త బ్యూటీలు రంగంలోకి దిగనున్నారు. దీంతో మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది. ఈ రేసులో కృతిని నిలబెట్టేందుకు మరో కొత్త క్రేజీ ప్రాజెక్టు ఇప్పుడు ఎంతైనా అవసరం ఉంది.