NTR: కంచికచర్ల పట్టణంలోని అరుంధతి కాలనీలో ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ పండుగలా సాగుతోంది. టీడీపీ సీనియర్ నాయకులు శేషం కనకరత్నం సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెన్షన్ దారులు సకాలంలో తమ లబ్ధిని పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.