NDL: అవుకు మండలం కునుకుంట్ల గ్రామ సమీపంలో ఉన్న కంబగిరి స్వామి క్షేత్రంలో ఇవాళ డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కంబగిరి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.