KRNL: పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ సచివాలయం మహిళా పోలీస్ త్రివేణి ఇవాళ ఉదయం తుగ్గలి మండలం గిరిగెట్ల వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పింఛన్ల పంపిణీ కోసం వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి, 108 అంబులెన్స్ ద్వారా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.