KRNL: వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.