KNR: వీణవంక సమ్మక్క-సారలమ్మ జాతర వివాదం కేసులో విచారణ ను సీబీ సీఐడీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న మరో 16 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. జనవరి 29న జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది.