SRPT: ఐపీఎల్ నేపథ్యంలో అక్రమ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ యువతకు సూచించారు. ఆన్లైన్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని ఎస్సై సూచించారు.