SKLM: పలాస కాశీబుగ్గలో గంజాయితో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పలాస రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి నుంచి 7.610 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.