TG: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నిరవధికంగా బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు కమిషన్ మార్జిన్‌ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ చికెన్ షాప్ యజమానుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన అద్దెలు, కరెంట్ బిల్లుల దృష్ట్యా కేజీకి రూ. 30 మార్జిన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల చికెన్ ప్రియులకు, హోటల్ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పవు.