దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 41.41 లక్షల అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఆధార్ అనుసంధానం, ఇ-పాస్ పరికరాల ద్వారా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని మంత్రి నిముబెన్ తెలిపారు. IT, GST డేటా ఆధారంగా తొలగింపు ప్రక్రియ చేపట్టామన్నారు. అత్యధికంగా రాజస్థాన్లో 6 లక్షల కార్డులు, అతి తక్కువగా ఏపీలో 102 కార్డులను తొలగించినట్లు స్పష్టం చేశారు.