WGL: వర్ధన్నపేట పురపాలక సంఘంలో మంగళవారం మున్సిపల్ అంచనా బడ్జెట్ సమావేశం జరిగింది. ఛైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం-వ్యయాల వివరాలను మున్సిపల్ అకౌంటెంట్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుధీర్ కుమార్, వైస్ ఛైర్మన్ నేతావత్ శిభారాణి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.