WNP: మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజు వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు.