CTR: చిత్తూరు జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వాహన తనిఖీలలో పట్టుబడిన 7 మందిని కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం రూ.70వేలు జరిమానా విధించారు. అదనంగా ఒకరికి రోజంతా కోర్టులో నిలబడే శిక్ష కూడా విధించబడింది. ట్రాఫిక్ అధికారులు మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.