MDK: ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతుబీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్ కార్డ్ వంటి పథకాల పురోగతిని ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామసభల నిర్వహణకు సంబంధించి అన్ని సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.