KMM: ముదిగొండ మండలంలోని యడవల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో పశువులకు సోకుతున్న గాలికుంట వ్యాధి నియంత్రణ చర్యలను జిల్లా పశువైద్యాధికారి పురంధర్ మంగళవారం పరిశీలించారు. ఆయన రైతులతో మాట్లాడి పశువుల ఆరోగ్యంపై ఆరా తీశారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వైద్యాధికారి అశోక్‌కు పలు సూచనలు చేశారు. టీకాల పంపిణీ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.