తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇంఛార్జ్ వడ్డీ రఘురాం అధ్యక్షతన పశ్చిమగోదావరి జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ లంక రాజశేఖర్ ఆధ్వర్యంలో 32 వ వార్డుకు చెందిన 12మంది నాయకులు మంగళవారం వైసీపీ పార్టీలో చేరారు. వీరికి రఘురామ్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాంలో వార్డు ఇంఛార్జ్ నీలం నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.