CTR: ఐరాల మండలం బీరప్పచెరువు ప్రభుత్వ పాఠశాలను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి టీచర్లు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్నారు. అనంతరం పలు అంశాలపై టీచర్లతో మాట్లాడారు.