VSP: తణుకు మున్సిపాలిటీలో 2021-22లో భూస్వాధీనం పేరుతో జారీ చేసిన TDR బాండ్లు వివాదాస్పదమయ్యాయి. సుమారు 21 ఎకరాలకు గజాల లెక్కన రూ.800 కోట్ల బాండ్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ విలువ కంటే నాలుగు రెట్లు అధికంగా జారీ చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం బాండ్లను బ్లాక్ లిస్ట్ చేయగా, కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.