»This Is The Intention Behind Changing Ts To Tg Revanth Reddy
Revanth Reddy: టీఎస్‌ను టీజీగా మార్చడం వెనుక ఉద్దేశం ఇదే
ఆదివారం రోజు క్యాబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. టీఎస్ ను టీజీగా మార్చడం వెనుకు అసలు ఉద్దేశం ఏంటో వివరించారు.
This is the intention behind changing TS to TG.. Revanth Reddy
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై రాష్ట్రంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన సోషల్ మీడియా ఖాతా వేదికగా స్పందిస్తూ.. వాటికి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం క్యాబినెట్ మీటింగ్‌లో సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. జయజయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా అధికారిక ప్రకటన చేసింది. అలాగే వాహన రిజిస్ట్రేషన్‌ను టీఎస్ నుంచి టీజీ మార్చనున్నట్లు తెలిపింది. దీనిపై సర్వత్ర భిన్న అభిప్రయాలు నెలకొన్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకే టీఎస్‌ను టీజీగా మార్చినట్లు పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో ప్రజలంతా టీజీ అనే వాడారు. వారి ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొనే క్యాబినెట్లో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చనున్నట్లు తెలిపారు. ఆయన ఎక్స్ ఖాతాలో ఈవిధంగా రాసుకొచ్చారు. “ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో…‘జయ జయహే తెలంగాణ….’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా… సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా.. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు… ఉండాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.” అని రాసుకొచ్చారు.