KNR: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోలి చంద్రారెడ్డి (55) దుర్మరణం చెందారు. బైక్పై వెళుతున్నప్పుడు కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు.