ATP: జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వ్యాధి ప్రబలకుండా నిర్మూలించాలన్నారు.