TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా చీపురు పట్టి అధికారులు, సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని అధికారులు, సిబ్బంది కమిషనర్‌తో కలసి ప్రతిజ్ఞ చేశారు.