SRPT: జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో భూముల సర్వేను శనివారం మండల ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలన్నారు. వారి వెంట తహశీల్దార్ శ్రీనివాసులు, ఏవో గణేష్, ఆర్ఐ ప్రసన్న, శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.