KNR: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణాన్ని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా ఆయన ప్రాంగణంలో ఉన్న వివిధ భవనాలను, కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ప్రాంగణ అభివృద్ధిపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు.