NLG: కాబోయే సర్పంచ్లు ఊరికో గ్రంథాలయం నెలకొల్పాలని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ సూచించారు. సర్పంచ్ అభ్యర్ధులు గ్రామభివృద్దిలో భాగంగా గ్రామాల్లోని యువతకోసం ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటుకు హామీ ఇవ్వాలని అన్నారు. తమ విపంచి ఫౌండేషన్ ద్వారా ఫర్నిచర్, పుస్తకాలను అందిస్తామన్నారు.