TG: కరీంనగర్ హుస్నాబాద్‌లో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హుస్నాబాద్‌లో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తున్నారు.