KNR: విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలని, మత్తు పదార్థాలకు, ఫోన్లకు దూరంగా ఉండి చదువుకోవాలని పలువురు వక్తలు అన్నారు. చొప్పదండి ZPHS (బాలురు)లో మంగళవారం స్నేహిత కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంఈవో మోహన్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, హెచ్ఎం జలీల్ మాట్లాడుతూ.. బాలబాలికలు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలని, ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని సూచించారు.