TG: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కోకాపేట నియోపోలీస్ భూముల విలువ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో HMDA నిర్వహిస్తున్న భూవేలాలకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించి రూ.2,708 కోట్లు సంపాదించిన HMDA, ఇవాళ మూడో విడత వేలానికి సిద్ధమైంది. ప్లాట్ నెంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ జరగనుంది.